ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 6:33 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న డిజైన్ డెమోక్రసీ 2026

అర్జున్ సమాచారం:
భారతదేశంలో ప్రముఖ డిజైన్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిన డిజైన్ డెమోక్రసీ నాలుగో ఎడిషన్‌కు సిద్ధమైంది బంజారాహిల్స్ లోని రెడిసన్ బ్లూ హోటల్లో వెల్లడించారు. సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది అన్నారు.
200కు పైగా డిజైన్ బ్రాండ్లు, 150 మందికి పైగా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు, కళాకారులు, నిపుణులు పాల్గొననున్నారు. 30 వేల మందికి పైగా సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఆర్ట్, టెక్స్‌టైల్స్, హస్తకళలకు సంబంధించిన ప్రదర్శనలు, ఇన్‌స్టాలేషన్లు, ప్యానెల్ చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డిజైన్ భవిష్యత్తుపై డీడీ టాక్స్, డీడీ ఫోకస్ కార్యక్రమాలతో పాటు ‘ది గౌర్మెట్ జోన్’ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
భారతీయ డిజైన్, సృజనాత్మకత, సంప్రదాయం, ఆధునికతను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా డిజైన్ డెమోక్రసీ 2026 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
======================